లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, దేశ స్వాతంత్య్ర సమరయోధులు, ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల సభ్యులందరికీ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకున్నారు. టాక్ సభ్యులందరికి ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ ఆ మహనీయుల ఆశయాల సాధనకు అందరు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ సెక్రెటరీ రాకేశ్ పటేల్ మాట్లాడుతూ భారతీయతే మనకు ప్రథమం అనే సందేశాన్ని తీసుకెళ్లే దిశగా టాక్ సంస్థ ఆరో ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా టాక్ కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం సభ్యులు కొత్త సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. నూతన సభ్యులు నిఖిల్ వేముల, సందీప్ బుక్క, నీలిమ, హారిక, కార్తిక్ శ్రీవాస్తవ, గణేష్ కుప్పాలను ప్రవీణ్ వీర, సత్యపాల్, మల్లారెడ్డి, సుప్రజ పులుసు టాక్ కండువాలు కప్పి కమిటీలోకి ఆహ్వానించారు.
ఈ వేడుకలో టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి, బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దూసరి కార్యవర్గ సభ్యులు నవీన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ వీర, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, హరి గౌడ్, రాకేష్ పటేల్, సత్యపాల్, మల్లారెడ్డి, నిఖిల్ వేముల, సందీప్ బుక్క, కార్తీక్ శ్రీవాస్తవ, గణేష్ కుప్పాల, శివ వెన్న, లడ్డు, ప్రశాంత్, మనోజ్, నితిన్, సాయి కిరణ్ రెడ్డి, అక్షయ్, ధీర, మహిళా విభాగం సభ్యులు సుప్రజ పులుసు, నీలిమ, హారిక, నందిని, పావని, తార తదితరులు పాల్గొన్నారు.