Namaste NRI

బోఇసీ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో  ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోఇసీ తెలుగు అసోసియేషన్‌ (బీటీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోఇసీ తెలుగు అసోసియేషన్‌ ఏర్పాటు ఉద్దేశాన్ని వ్యవస్థాపకులు హరి విన్నమాల, అధ్యక్షుడు అనిల్‌ కుకుట్ల వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, మన పిల్లలతో పంచుకోవడమే బోఇసీ తెలుగు అసోసియేషన్‌ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బోఇసీ తెలుగు అసోసియేషన్‌ నూతన కార్యవర్గ పరిచయం కార్యక్రమం నిర్వహించారు. బీటీఏ నూతన అధ్యక్షురాలు సింధు మెట్పల్లి, ఉపాధ్యక్షులు శివ నాగిరెడ్డి ఉయ్యూరు, క్రియేటివ్‌ హెడ్‌ మైత్రి కర్నటీ, కార్యదర్శులు ధీరజ్‌ కనకనాల, ఆది మెడ్చెర్ల, కోశాధికారి ఫణి తేజ, సాంస్కవృతిక నిర్వాహకులు అనంత్‌ నిభానుపూడిని సభికులకు పరిచయం చేశారు. క్రోధి వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన వారికి హరి విన్నమాల, సింహాచలం మెమెంటోలు అందజేశారు.

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన 16 పెద్ద ఈవెంట్స్‌ విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన బీటీఏ ఉపాధ్యక్షురాలు సింధు మెట్పల్లి, కార్యదర్శి శివ నాగిరెడ్డి ఉయ్యూరు, కోశాధికారి రామ్‌ యాగంటి, మీడియా కార్యదర్శి భార్గవి రాజన్‌, సాంస్కృతిక నిర్వాహకులు మైత్రి కర్నటీ, ఈవెంట్‌ నిర్వాహకులు శశాంక్‌ వేమూరి, హరీష్‌ వీరవల్లికి ధన్యవాదాలు తెలిపారు. పిల్లలు, పెద్దలు తెలుగు పాటలు, నృత్యాలతో సభికులను అలరించారు. అనంతరం తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందు నోరూరించింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది తెలుగు వారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events