Namaste NRI

అమెరికాలో ఘనంగా అట్లతద్దె వేడుకలు

ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ వాసులు బతుకమ్మ పండగను నిర్వహిస్తున్న నేపథ్యం లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు అట్లతద్దెను అదేస్థాయిలో నిర్వహించారు. ముగ్గులు, ఆటల పోటీలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించా రు. విజేతలుగా నిలిచివారికి బహుమతులు అందజేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఉమాగౌరీ వ్రతం వేడుకగా చేశారు. పెద్దఎత్తన సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ పూర్వాధ్యక్షురాలు  సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో కాలక్రమేణ అట్లతద్దె కనుమరుగు అవుతోంది. ఆనాటి పండుగలు, వేడుకల పట్ల శ్రద్ధ చూపడం లేదు. ఆ పండుగలు అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమెరికా లో ఉన్న పిల్లలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు.

సుధ కొండపు మాట్లాడుతూ ఈ పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఉయ్యాల ఏర్పాటుచేసి వాయినాలు పంపిణీ చేశామని తెలిపారు. ఉత్సాహంగా మెహందీ కార్యక్రమంలో పాల్గొని గోరింటాకు పెట్టుకున్నారు అని తెలిపారు. సాంస్కృతి కార్యక్రమాలను నవ్య ఆలపాటి, సుష్మ అమృతలూరి సమన్వయపరిచారు.

 ఈ కార్యక్రమంలో అనిత మన్నవ, తనూజ యలమంచిలి, శ్రీదివ్య సోమ, గీత చిలకపాటి, ఇందు చలసాని, శిరీష నర్రా, అపర్ణ ఆలపాటి, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, ఫణి గాయత్రి, సరిత ముల్పూరి, మల్లి నన్నపనేని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events