చార్‌ధామ్ యాత్రపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు ఉపసంహరించుకుంది. కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ 19 నెగిటివ్ రిపోర్ట్, సంపూర్ణంగా టీకా డోసులు వేయించుకున్న ధృవీకరణ పత్రం తమ వెంట తీసుకురావాలని తెలిపింది. కేదార్‌నాథ్ దేవాలయానికి 800 మంది, బదరీనాథ్ దేవాలయానికి 1200 మంది, గంగోత్రికి 600 మంది, యమునోత్రికి 400 మంది భక్తులను అనుమతించింది. అంతకు మందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం హైకోర్టు తెలిపిన వివరాల్లో కొవిడ్ 19 పరిస్థితి మెరుగుపడిరదని తెలిపింది. చార్‌ధామ్ యాత్ర మార్గంలో నివసించే ప్రజలు అక్కడికి వచ్చే భక్తులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది. యాత్రను అనుమతించాలని కోరింది.