Namaste NRI

ఫోర్బ్స్ ఐకానిక్ అవార్డ్ అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్ ఎండి మల్లికార్జున్ కుర్రా

సమూహ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున్ కూర్రా ప్రతిస్టాత్మకమైన ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ లో స్థానం సంపాదించారు. ప్రతి ఏటా ఫోర్బ్స్ మాగజైన్ అందించే ఫోర్బ్స్ ఐకానిక్ అచీవర్ అవార్డ్ 2021 ముంబయి లోని నోవాటెల్ జూహు హోటల్ లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో మాజీ క్రికెటర్ శ్రీ సందీప్ పాటిల్ చేతుల మీదుగా సమూహ ప్రాజెక్ట్స్ మానేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ కుర్రా అందుకున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రెస్టేజీయస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ను అందిస్తున్న సంస్థ గా సమూహ ప్రాజెక్ట్స్ అందరి మన్ననలు పొందుతుంది.

ఈ సందర్భంగా మల్లికార్జున్ కుర్రా మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమూహ ప్రాజెక్ట్స్ యొక్క శ్రేయోభిలాషులకు , ఇన్వెస్టర్స్ కు, ఆఫీస్ సిబ్బందికి, మార్కెటింగ్ మిత్రులకు, కస్టమర్స్ కు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో అద్భుతమైన నాణ్యమైన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ను కస్టమర్స్ కి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events