
అమెరికా పర్యటనలో ఉన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అట్లాంటాలోని ఆల్ఫారెటాలో ఉన్న గేమ్ అండ్ గ్రిల్ ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించారు. అకాడమీ అంతటా కలియతిరుగుతూ, అక్కడ శిక్షణ ఇస్తున్న బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆటల కోసం ఏర్పాటు చేసిన కోర్టులు, కోచ్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీలో అమెరికా స్థాయిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ వివరాలను నిర్వాహకులు రాముతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాము కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ తన మొదటి ఇల్లు అయితే, అట్లాంటా తన రెండ్లో ఇల్లని అన్నారు. స్నేహితులను కలవడం, వారు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీని నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలంటే తనకు కూడా చాలా ఇష్టమని, అందుకే గుడివాడలో స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గుడివాడ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని తగిన సహాయం చేస్తున్నానని తెలిపారు.















