Namaste NRI

ఏడాది వయసుకే గిన్నీస్‌ రికార్డు… ప్రపంచంలోనే

ఘనాకు చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నీస్‌ బుక్‌ రికార్డు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఏస్‌ లియామ్‌ ననా శామ్‌ ఘనత సాధించాడు. అతడి రికార్డును గిన్నిస్‌ బుక్‌ అధికారికంగా ప్రకటించింది. అందులో అర్హత సాధించడానికి అక్కోరాలోని మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించే ప్రొఫెషనల్‌ ఎగ్జిబిషన్‌లో శామ్‌ పాల్గొన్నాడు. అక్కడ అతని 10 పెయింటింగ్‌లలో 9 అమ్ముడుపోయాయి.

ఇప్పటికే 15 చిత్రాలు అమ్మిన బాలుడు మరిన్ని చిత్రాల వేలానికి సిద్ధమవుతున్నాడు. లియామ్‌కు ఈ విద్య చిత్రకారిణి ఆయన ఆమె తల్లి ద్వారా సంక్రమించింది. అతని ప్రతిభను ఆరు నెలల వయసులోనే ఆమె గుర్తించింది. తొలుత కాన్వాస్‌పై రంగులు చల్లి దానిని చిందరవందర చేసేవాడని, ఆ నేపథ్యంలో ఆ పసికందు ద క్రాల్‌  పేరుతో ప్రసిద్ధిగాంచిన తొలి మాస్టర్‌ పీస్‌ను సృష్టించినట్టు ఆమె తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events