నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. డా.సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సినిమా నుంచి పైసా డుమ్ డుమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ మా సినిమాను అవతార్ సినిమాతో పాటే రిలీజ్ చేస్తున్నాం. ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. డార్క్ కామెడీ జోనర్‌లోనే కొత్తగా ప్రయత్నించాం. తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన వార్ ఈ మూవీ కాన్సెప్ట్. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది మా మూవీలో ఫన్‌తో చూపించాం అని డైరెక్టర్ మురళీ మనోహర్ చెప్పారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ కామెడీలోనే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమాలో నటించిన తర్వాత అనిపించింది అని చెప్పారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ పైసా డుమ్ డుమ్ సాంగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఈ సినిమాలో నా ఇంటిపేరు గుర్రం. నా పేరు పాపిరెడ్డి. నా కెరీర్‌లో ఇదొక కొత్త తరహా క్యారెక్టర్‌లా పేరు తీసుకొస్తుంది అని అన్నారు.
















