
విదేశీ వృత్తి నిపుణులకు ఇస్తున్న హెచ్1-బీ వీసా ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు ప్రతిపాదిస్తూ ట్రంప్ సర్కార్ చేపట్టిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సరికొత్త వీసా విధానంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు రూపొందించగా, వాటిపై (హెచ్1-బీ లాటరీ సిస్టం) తుది సమీక్ష మొదలైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలనుఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తున్నది. ఫెడరల్ నిబంధనల మార్పులపై సమీక్షను చివరి దశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు ఖరారు చేసి వాటిని ప్రకటిస్తారు. సమీక్షను పూర్తి చేసి తుది నిబంధనలకు సంబంధించి అడ్వాన్స్ కాపీని త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది నుంచే హెచ్-1బీ వీసాల జారీకి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని అమెరికా సర్కార్ భావిస్తున్నది.















