Namaste NRI

హ్యాపీ రాజ్ వచ్చేస్తున్నాడు

జి.వి.ప్రకాశ్‌కుమార్‌, శ్రీగౌరిప్రియ జంటగా రూపొందిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ హ్యాపీ రాజ్‌. మరియారాజా ఎలాంచెజియస్‌ దర్శకుడు. బియాండ్‌ పిక్చర్స్‌ పతాకంపై జైవర్ద నిర్మించిన ఈచిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతిష్టాత్మక చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తుండటం విశేషం.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటనతోపాటు ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రచార పరంగా తమిళంలో ఇప్పటికే ఈ సినిమా బజ్‌ క్రియేట్‌ చేసిందని, నేటి నుంచి తెలుగు ప్రమోషన్స్‌ మొదలుపెట్టామని, నేటియువతకు నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని మేకర్స్‌ తెలిపారు. అబ్బాస్‌, జార్జ్‌ మరియన్‌, గీతా కైలాసం, ప్రార్థన నాథన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: మదన్‌ క్రిస్టోఫర్‌, సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, సహ నిర్మాత: జైకాంత్‌ సురేష్‌.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events