Namaste NRI

శశివదనే టైటిల్ సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా రూపొందుతున్న సినిమా శశివదనే. ఈ చిత్రాన్ని లవ్, యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన రూపొందిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకాలపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. శరవణ వాసుదేవన్ స్వరపర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా హరి చరణ్, చిన్మయి శ్రీపాద పాడారు.  ఈ చిత్రంలో ప్రవీణ్ యండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ సినిమాకు మంచి తెలుగు టైటిల్ పెట్టారు. ఆకట్టుకునే సంగీతం, సాహిత్యం కుదిరాయి. ఈ పాటలో  చేతిలో చెయ్యి వేస్తే నువ్వు గీతలే మారవా అనే లైన్ బాగా నచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ మా సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. సాంగ్ చాలా వచ్చింది. కోమలీ గారు అద్భుతంగా చేశారు అని అన్నారు.

కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ హరీష్ శంకర్ వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనకు సాంగ్ నచ్చడం మా ఫస్ట్ సక్సెస్. దర్శకుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, వీళ్ళందరినీ వెనుక ఉండి నడిపించిన నిర్మాతలు ఎవరు లేకపోయినా ఇంత అందంగా సాంగ్ వచ్చేది కాదు. నాకు వాటర్ ఫోబియా ఉంది. అయితే సాంగ్ అంతా బోటు ఎక్కించారు. రక్షిత్ లేకపోతే సాంగ్ ఇలా వచ్చేది కాదు  అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events