నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలోని నా కోసం మారావా నువ్వు అనే పాటని విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సిద్ద్ శ్రీరామ్ ఆలపించారు. సోగ్గాడే చిన్ని నాయనాకు ది స్రీక్వెల్. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యమంగా బంగార్రాజుగా నాగ్ గెటప్, ఆయన పలికే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నాగార్జున, చైతూలను ఒకేసారి, ఒకేతెరపై చూడడం అభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తుందని చిత్రబృందం తెలిపింది. కృతిశెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. చలపతిరావు, రావు రామేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రaాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: సత్యానంద్, కెమెరా: యువరాజ్. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిమి. తప్పకుండా ప్రేక్షుల మనసుల్ని గెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా సాగుతోందని సినీ వర్గాలు తెలిపాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)