హెచ్-1బీ వీసా పై ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో భారత ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా ల జారీపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. దీనిపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ స్పందిస్తూ.. తమ సంస్థ హెచ్-1బీ వీసా (H-1 B Visa)లపై ఆధారపడి పని చేయబోదని మీడియాకు చెప్పారు. ట్రంప్ హయాంలో ఐటీ బిజినెస్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.
అమెరికాలో పని చేస్తున్న మా ఉద్యోగుల్లో దాదాపు 80శాతం స్థానికులే. ఐటీ పరిశ్రమలో హెచ్1 బీ వీసాపై మా కంపెనీ ఆధారపడటం తక్కువ. ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. నాలుగేండ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదురైంది. మేం ఉద్యోగుల నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ స్వావలంభన సాధించాం అని రాజన్ చెప్పారు. ప్రతియేటా తమ సంస్థకు జారీ చేస్తున్న హెచ్-1బీ వీసా ల సంఖ్య దీన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతియేటా తమ సంస్థకు జారీ అయ్యే హెచ్-1బీ వీసా లు 500-1000 మధ్యే ఉంటాయన్నారు.