Namaste NRI

ఆయన తన భార్య పేరే  గుర్తుంచుకోలేరు  కానీ… తనపై విమర్శలు

అమెరికా అధ్యక్ష పీఠం కోసం రెండోసారి  పోటీపడుతున్న జో బైడెన్‌ కు వయసురీత్యా వచ్చే ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దీనికి సంబంధించిన వస్తోన్న విమర్శలను ఆయన మరోసారి తోసిపుచ్చారు. అలాగే తన ప్రధాన పోటీదారు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు తన సతీమణిని వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికను ప్రస్తావించారు. లేట్‌ నైట్‌ విత్‌ సేథ్‌ మేయర్స్‌ షోలో పాల్గొన్న బైడెన్‌ ఈ మేరకు స్పందించారు. మీరు అవతలి వ్యక్తి ( ట్రంప్‌ను ఉద్దేశించి) ని పరిశీలించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే. ఆయన తన భార్య పేరును గుర్తుంచు కోలేరు అని బైడెన్‌ విమర్శలు చేశారు. అలాగే ఆయన ఆలోచనలన్నీ కాలం చెల్లినవని వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేక తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అనే దానిపై స్పష్టత లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events