Namaste NRI

అవసరమైతే తాను మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటా

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ఇటీవల మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2021 మే నెలలో బిల్‌, మెలిండాలు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి డైవర్స్‌ కన్ఫర్మ్‌ అయింది. అయితే గేట్స్‌ ఫౌండేషన్‌ కోసం మాత్రం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్‌ గేట్స్‌ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. మెలిండాతో వైవాహిక బంధం అద్బుతంగా సాగిందని, ఒకవేళ మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే, మెలిండాను చేసుకోవడంలో సమస్య లేదన్నారు.

                గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు బిల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మెలిండాతో బిల్‌ వర్కింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రతి మ్యారేజ్‌లోనూ మార్పు ఉంటుందన్నారు. పిల్లలు పెరిగిన తర్వాత ఫ్యామిలీని వదిలేస్తామని, తనకు జరిగిన మార్పు విడాకులు తీసుకోవడమే అని తెలిపారు. మెలిండాతో బంధం తెగినా తమ వైవాహిక జీవితం అద్భుతంగా సాగిందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events