అమెరికా లో రాజకీయ నాయకునిగా మారిన ఇండియన్ అమెరికన్ డాక్టర్ అమీ బేరాకు చాంపియన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్నొవేషన్ అవార్డు లభించింది. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన వైద్యసేవలు అందించినందుకు గాను ఈ అవార్డు బహూకరించారు. అమెరికా కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేస్తున్న ఇండియన్ అమెరికన్‌గా 58 ఏళ్ల బెరా గుర్తింపు పొందారు. గత వారం నిర్వహించిన కౌన్సిల్‌కు చెందిన ఇన్నొవేషన్ ఎక్స్‌పో సందర్భంగా అవార్డు బహూకరించారు. ఒక వైద్యుడిగా, ప్రతి అమెరికన్‌కు అధిక-నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా కృషి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను అని తెలిపింది. 2013లో కాంగ్రెస్ మన్‌గా ప్రమాణస్వీకారం చేయక ముందు బెరా కాలిఫోర్నియా లోని సాక్రమెంటో కౌంటీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హౌస్ ఫారెన్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా ఉన్నారు.
