Namaste NRI

హాయ్‌ నాన్న మ్యూజికల్‌ ప్రమోషన్స్‌

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డా॥ విజయేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను ఆరంభించబోతున్నారు. అందులో భాగంగా సమయమా  అనే గీతాన్ని ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాటను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషన్‌ డ్రామా ఇది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సకుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన హాయ్‌ నాన్న టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, దర్శకత్వం: శౌర్యువ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events