ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగా ముఖ్యమైన అన్ని కేంద్రాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్టు న్యూయార్క్ పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబులు జారవిడిచింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది.
