Namaste NRI

మరో సంచలన రిపోర్ట్ బయట పెట్టనున్న హిండెన్‌బ‌ర్గ్‌

హిండెన్‌బ‌ర్గ్ రీస‌ర్చ్  సంస్థ త్వ‌ర‌లో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఇటీవ‌ల అదానీ స్టాక్స్ అంశంపై అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వ‌ల్లే ఆ కంపెనీ షేర్లు ప‌త‌న‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు హిండెన్‌బ‌ర్గ్ ఎవ‌ర్ని టార్గెట్ చేసింద‌న్న కోణంలో పుకార్లు సాగుతున్నాయి. ఓ అతిపెద్ద విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయ‌నున్న‌ట్లు హిండెన్‌బ‌ర్గ్ వెల్ల‌డించింది. త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోయే రిపోర్టులో ఎవ‌రి గురించి ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆ సంస్థ చెప్ప‌లేదు. కానీ ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన బ్యాంకుల మూసివేత  గురించి కొత్త రిపోర్టు ఉంటుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 24వ తేదీన అదానీ గ్రూపుపై హిండెన్‌బ‌ర్గ్ సంస్థ 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అదానీ సంస్థ ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆ నివేదిక‌లో ఆరోపించింది. ఆ రిపోర్టు వ‌ల్ల అదానీ కంపెనీ ట్రేడింగ్‌లో సుమారు 86 బిలియ‌న్ల డాల‌ర్లు న‌ష్ట‌పోయింది.

Social Share Spread Message

Latest News