Namaste NRI

కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర.. ఆడియోను విడుదల

విజయ్‌ భాస్కర్‌, అనుషా, అశోక్‌ కుమార్‌, ఆనంద్‌ భారతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కర్మయోగి శ్రీధర్మవ్యాధుడి చరిత్ర. ఈ చిత్రంలోని అన్ని పాటలను స్వర్గీయ ఎస్పీబాలు పాడటం విశేషం. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.  బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, హ్యూమన్‌ రైట్స్‌ చైర్మన్‌ జేసీ చంద్రయ్య అతిథులుగా పాల్గొన్నారు. త్రేతాయుగంలో ధర్మమార్గం బోధించిన ధర్మవ్యాధుడి చరిత్రను సినిమా రూపొందించడం సంతోషంగా ఉంది. ఆయన జీవితం ఆదర్శనీయం అని దర్శకుడు అన్నారు. భోగికార్‌ శ్యామల జమ్మురాజా సమర్పణలో శ్రీదుర్గా భవాన్ని క్రియేషన్స్‌ పతాకంపై ఉల్కందేకార్‌ మురళీధర్‌ నిర్మిస్తున్నారు. జీజే రాజా దర్శకుడు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, నిర్మాతలు రామస్యతనారాయణ, సాయివెంకట్‌, ఉపేంద్రతోపాటు, నటులు అశోక్‌కుమార్‌, పాటల రచయిత కావూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events