
భారతదేశంలో హోలీ పండుగను కొద్దిలో మిస్ కావడం తన దురదృష్టమని అమెరికా నేషనల్ ఇంటెలిజన్స్ విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటనకు వచ్చిన ఆమె, మరో రెండు రోజులు ముందుగా తన టూర్ ప్లాన్ చేసుకుని ఉంటే హోలీ వేడుకల్లో పొల్గొనేదాన్నని అన్నారు.

దేశ ప్రజలు గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబురాలు చేసుకున్నారు. హిందూ సాంప్రదాయాలను పాటించే తులసి గబ్బార్డ్ పండుగ జరిగిన రెండు రోజులకే భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను హోలీ గురించి ప్రశ్నించగా, హోలీ ఒక అద్భుతమైన పండుగ అని, కలర్ ఫుల్ పండుగ అని చెప్పారు. తాను హోలీ పండుగ సంబురాల్లో పాల్గొనలేకపోవడం తన దురదృష్టమని అన్నారు.
