కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. అమెరికాలో ఒక్కరోజులేనే సుమారు 10 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హాంగ్ కాంగ్లో కూడా ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దాదాపు 8 దేశాల విమానాలపై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది దేశాల విమానాలపై నిషేధం విధించింది. ఈ జాబితాలో యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ సహా ఇండియా కూడా ఉంది. అంతేకాకుండా ఆ దేశ ప్రజలకు కూడా హాంగ్ కాంగ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. శుక్రవారం నుంచి సాయంత్రం 6 తర్వాత ఇండోర్ డైనింగ్‌పై నిషేధం అమల్లోకి వస్తుందని చెప్పింది. స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ సెంటర్లు, బార్లు, క్లబ్బులు, మ్యూజియంలు మూతపడతాయని వెల్లడిరచింది.














