
శివ కంఠంనేని, ఏస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. జీవీకే దర్శకుడు. కెఎస్ శంకర్‌రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటీనటులందరూ నల్లటి దుస్తులు ధరించి సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే హారర్ థ్రిల్లర్ ఇదని, కథలోని మలుపులు సస్పెన్స్ ను పంచుతాయని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తామని చిత్రబృందం పేర్కొంది. అశోక్‌కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: పద్మనాభన్ భరద్వాజ్, నిర్మాతలు: కెస్ శంకర్‌రావు, ఆర్.వెంకటేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవీకే.
