అమెరికా తుపాకీ సంస్కృతిపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. టెక్సాస్‌లో స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో బైడెన్ వైట్‌హౌజ్‌లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేవుడా ఇంకెప్పుడు ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో మరో సామూహిక హత్య జరిగినట్లు ఆయన అన్నారు. అందమైన, అమాయక, చిన్న పిల్లల్ని పొట్టనపెట్టుకున్నారని, ఫ్రెండ్స్ చనిపోతుంటే ఇంకా ఎలా ఆ చిన్నారులు ఆ విలయాన్ని చూస్తుంటారని అన్నారు. చిన్నారుల్ని కోల్పోవడం అంటే అది మన గుండెను గుచ్చడమే అన్నారు. ఇది తన శ్వాసను పట్టేసినట్లుగా ఉందన్నారు. బాధితుల కోసం నివాళి అర్పించాలని, గన్ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. గన్ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేస్తామని, మనకు ఇంకెంత ధైర్యం కావాలని ప్రశ్నించారు.