చైనా టెలికం పై అమెరికా నిషేధం విధించింది. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో చైనా టెలికం (అమెరికాస్) కార్పొరేషన్ తన కార్యాకలాపాలను అమెరికా నేలపై నిర్వహించకూడదని తెలిపింది. 60 రోజుల్లోగా నిలిపివేయాలని ఫేడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) ఆదేశించింది. చైనాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోని మూడు అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థల్లో చైనా టెలికం లిమిటెడ్ ఒకటి.














