దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని టీసీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కరోనాను నియంత్రించడానికి గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లైందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీసీఎస్లోని ఐదు లక్షల మంది ఉద్యోగులంకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ హెచ్ఆర్ హెడ్ మిలిండ్ లక్కాడ్ తెలిపారు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాత్రమే ఆఫీసులకు రావాలని మిలింద్ లక్కాడ్ చెప్పారని తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం 70 శాతానికి పైగా రెండు డోసులు వేసుకున్నారు. 95 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు సింగిల్ డోస్ వేయించుకున్నారు. ఇప్పటికే ఇతర ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీసు చేపట్టాలని ఆదేశించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)