అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ జడ్జి భారీ జరిమానా విధించారు. సుమారు 355 మిలియన్ల డాలర్లు అంటే దాదాపు 2900 కోట్ల పెనాల్టీ ఆయన చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ఆర్థిక పత్రాల తో బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ జడ్జి ఈ తీర్పును వెలువరిచారు. న్యూయార్క్ కార్పొరేషన్ కు ఆఫీసర్‌గా కానీ డైరెక్టర్‌గా మూడేళ్ల పాటు ఉండకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తన ప్రాపర్టీ ల విషయంలో ట్రంప్ అబద్దాలు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల పాటు ట్రంప్ మళ్లీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోరాదు అని జడ్జి ఆర్డర్ ఎంగోరణ్ ఆదేశించారు. అయితే ఈ తీర్పు పట్ల అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.