టేక్ మేధావి ఎలన్ మస్క్‌కి భారీ షాక్ తగలనుందా? అది సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే. సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్ అందులో మేజర్ షేర్ హోల్డర్ కూడా. ఈ క్రమంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఓ ఇన్వెస్టర్ ఆయన మీద కోర్టుకు ఎక్కవగా ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల భారీ జరిమానా మస్క్ చెల్లించాల్సి వస్తుందట. సోలార్‌సిటికి సంబంధించిన ఇన్వెస్టర్ ఒకరు మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండానే ఎలన్ మస్క్ సుమారు 2.6 బిలియన్ డాలర్ల డీల్ ఒకటి కుదుర్చుకున్నాడనేది ఇన్వెస్టర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గిస్తూ లాభాలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని, తన వరకు తనకు సంబంధించిన వాటా కోసం కోర్టును ఆశ్రయించినట్లు సదరు షేర్ హోల్డర్ పేర్కొన్నారు. ఇక ఈ దావాకు మిగతా షేర్ హోల్డర్స్ కొందరు మద్దతు ప్రకటించడం విశేషం. ఒకవేళ ఆరోపణలు రుజువైతే ఎలన్ మస్క్ 9.4 బిలియన్ డాలర్ల జరిమానా (మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) చెల్లించాల్సి ఉంటుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)