Namaste NRI

అగ్రరాజ్యంలో హరికేన్ బీభత్సం

అగ్రరాజ్యం అమెరికాను ఇయన్‌ హరికేన్‌ వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్టితో ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటి వరకూ నమోదైన శక్తిమంతమైన తుపాన్‌లో ఇదొకటిగా నిలిచిపోయింది. ఈదురుగాలులు ధాటికి ఓ రిపోర్టర్‌ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్‌ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో విద్యత్‌ సరఫరా నిలిచిపోయింది. 25 లక్షల మంది కరెంట్‌ లేక తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. టాంపా, ఒర్లాండ్‌ విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. వందల సంఖ్యలో మృతులు ఫ్లోరిడా కౌంటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events