Namaste NRI

హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే నెల 30వ తేదీన  హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్‌ 11న నామినేషన్ల  పరిశీలన జరుగనుంది. అక్టోబర్‌ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్‌ 30న  ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 2 ఓట్ల లెక్కింపు జరుగగా అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరప్‌ చేయడంతో తన ఎంఎల్‌ఏ పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజవకర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events