ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించిది. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మీ షో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ భేటీ అయ్యారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలోని టైర్`11 పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో సేవలను అందించనుంది. మీ షో ఈ కామర్స్ సంస్థ తెలంగాణలో టీ సాట్ నెట్‌వర్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ లాంటి వివిధ ప్లాట్‌ఫాంలతోపాటు తెలంగాణ అంతటా టైర్` 11 ఐటీ హబ్‌లను ఉపయోగించుకుంటుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన మీ షో వ్యవస్థాపకుడు విదిత్ ఆత్రేయనని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
