Namaste NRI

అమెరికాలో హైదరాబాద్‌ బాలుడి అద్భుత ఆవిష్కరణ

వైద్యరంగంలో తెలుగు బాలుడు సిద్ధార్థ్‌ నంద్యాల ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో నివాసముంటున్న 14 ఏండ్ల సిద్ధార్థ్‌ తన ఆవిష్కరణతో ఇటు సాంకేతిక రంగాన్ని అటు వైద్య రంగాన్ని అబ్బురపరిచాడు. అతడు ఆవిష్కరించిన యాప్‌ కృత్రిమే మేధ (ఏఐ) సాయంతో మనిషి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తున్నది. సర్కేడియన్‌ ఏఐగా పేరుపెట్టిన ఆ పరికరం ఏడు క్షణాలపాటు గుండెచప్పుడు విని, అది ఆరోగ్యంగా ఉన్నదా లేక వ్యాధి బారిన పడిందా అన్నది వెంటనే తేల్చేస్తున్నది.

దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఏఐ ప్రొఫెషనల్‌గా సిద్ధార్థ్‌ రికార్డు సృష్టించాడు. అతడు ఆవిష్కరించి న పరికరంతో ఇప్పటికే వేలమందిని పరీక్షించగా, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జో బైడెన్‌ల నుంచి ప్రశంసా పత్రాలను కూడా అందుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ టీనేజర్‌ చిన్న వయసులోనే అమెరికా వలస వెళ్లాడు. 2023వ సంవత్సరానికిగాను సిద్ధార్థ్‌ను ఇన్నోవేటర్‌ ఆఫ్‌ది ఇయర్‌గా ఫ్రిస్కో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎంపిక చేసింది. అదే ఏడాది అమెరికా ప్రజాప్రతినిధుల సభ అతడికి గుర్తింపు సర్టిఫికెట్‌ను జారీచేసింది.

Social Share Spread Message

Latest News