అమెరికా లో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు తమ సత్తా చాటారు. యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక వర్జీనియాలో జరిగిన ఎల్జీ ఎన్నికల్లో మరో భారత సంతతికి చెందిన మహిళ సత్తా చాటారు.

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు.. హైదరాబాద్ వాసి కూడా.
















