బెల్లంకొండ గణేష్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ నేను స్టూడెంట్ సర్. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 2గా వస్తున్న ఈ చిత్రాన్ని నాంది సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణచైతన్య కథను అందించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఫస్ట్‌సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో గణేష్, అవంతిక జోడీ ముచ్చటగా ఉంది. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతి క దస్సాని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. సముద్రఖని, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
