Namaste NRI

అలా పిలిస్తే నాకు నచ్చదు : నయనతార

సినిమారంగంలో అగ్రస్థానంలో ఉన్నవాళ్లకు ఇచ్చే టైటిల్‌ సూపర్‌స్టార్‌. హీరోహీరోయిన్ల పోరాటమంతా ఈ టైటిల్‌ కోసమే అని చెప్పాలి. విశేషమేంటంటే నయనతారను ఈ టైటిల్‌ వరించింది. ఆమె పేరు ముందట లేడీ సూపర్‌స్టార్‌ అనే ట్యాగ్‌ తగిలించేశారు అభిమానులు. అయితే, నయన్‌కు మాత్రం లేడీ సూపర్‌స్టార్‌ అని పిలిపించుకోవడం ఇష్టంలేదంట. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో పాల్గొన్న నయన్‌ తనని సూపర్‌స్టార్‌ అని పిలవడంపై స్పందించింది.  దయచేసి సూపర్‌స్టార్‌ అని పిలవకండి. అలా పిలిస్తే నాకు నచ్చదు. పైగా ఎవరైనా అలా పిలిస్తే తిట్టినట్టు అనిపిస్తుంది అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది నయన్‌. గతంలో ఈ టైటిల్‌ విజయశాంతికి ఉండేది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events