Skip to main content

Namaste NRI

సుమంత్ ప్రభాస్ గోదారి గట్టుపైన మే 8న రిలీజ్

హీరో సుమంత్‌ ప్రభాస్‌ నటిస్తున్న రూరల్‌ లవ్‌, ఫ్యామిలీ డ్రామా గోదారి గట్టుపైన. సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. నిధి ప్రదీప్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్‌ ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. ఒక వైపు సుమంత్‌ ప్రభాస్‌, మరో వైపు జగపతి బాబు, మధ్యలో నిధి ప్రదీప్‌ నిల్చున్న రిలీజ్‌ డేట్‌ అనౌన్స్మెంట్‌ పోస్టర్‌ కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రాజీవ్‌ కనకాల, లైలా, దేవి ప్రసాద్‌, సుదర్శన్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, వైవా రాఘవ్‌, రోహిత్‌ కృష్ణ వర్మ తదితరులు నటిస్తున్నారు. మే 8న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి నిర్మాత – అభినవ్‌ రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – మధులిక సంచన లంక, డీఓపీ – సాయి సంతోష్‌, సంగీతం – నాగ వంశీ కృష్ణ, ఎడిటర్‌ – అనిల్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News