రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శకుడు శంకర్‌తో పనిచేయాలని ప్రతి ఆర్టిస్టు కోరుకుంటాడు. ఈ సినిమాతో నాకు ఆ అదృష్టం దక్కింది. ఇందులో నేను సీఎం పాత్రను పోషించా. లుక్ పరంగా ప్రోస్థటిక్ మేకప్‌తో కనిపిస్తా. నేను ఇప్పటివరకు ఆ తరహా మేకప్ వేసుకొని నటించలేదు. మేకప్‌కే నాలుగు గంటల టైమ్ పట్టేది అన్నారు.
ఈ సినిమాలో తన పాత్ర డిఫరెంట్ షేడ్స్‌తో సాగుతుందని, ఎన్నో సస్పెన్స్‌లతో థ్రిల్‌ని పంచుతుందని, కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు. గోవిందుడు అందరివాడే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించానని, ఇప్పుడు తను నటనలో మరింత పరిణితి సాధించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడని, రామ్‌చరణ్ పోషించిన అప్పన్న పాత్రను చూస్తే అందరూ షాక్ అవుతారని చెప్పారు. డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమైందని,నిర్మాత దిల్‌రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా ను తెరకెక్కించారని శ్రీకాంత్ పేర్కొన్నారు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.