Namaste NRI

లాభాల కంటే సిద్ధాంతాలే ముఖ్యం..జడ్జిని తొలగించాలన్న మస్క్

బ్రెజిల్ సుప్రీంకోర్టు జ‌డ్జి, బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ మ‌ధ్య వార్ న‌డుస్తోంది. కొన్ని అకౌంట్ల‌ను బ్లాక్ చేయాల‌ని ఇటీవ‌ల బ్రెజిల్ సుప్రీం జ‌డ్జి ఆదేశించారు. ఆ కేసులో ద‌ర్యాప్తున‌కు కూడా ఆ జ‌డ్జి ఆదేశించారు. అయితే ఆ ఎక్స్ అకౌంట్ల‌ను రియాక్టివేట్ చేయ‌నున్న‌ట్లు మ‌స్క్ ప్ర‌క‌టించారు. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఫైట్ మొద‌లైంది. భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకుంటున్నార‌ని మ‌స్క్ ఆరోపించారు. దేశంలోని కొన్ని ఎక్స్ అకౌంట్ల‌ను బ్లాక్ చేయాల‌ని జ‌డ్జి అలెగ్జాండ్రే డీమోర‌ల్స్ ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు రాజ్యాంగ వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, ఆ అకౌంట్ల‌పై పెట్టిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తాన‌ని, జ‌డ్జి మోరేల్స్ రాజీనామా చేయాల‌ని మ‌స్క్ డిమాండ్ చేశారు. అయితే ఇంత‌కీ ఏయే ఎక్స్ అకౌంట్ల‌ను బ్లాక్ చేశార‌న్న అంశాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు బ్రెజిల్ అధికారులు కానీ, ప్ర‌భుత్వ అధికారులు కానీ వెల్ల‌డించ‌లేదు.

Social Share Spread Message

Latest News