Namaste NRI

అమెరికా ఆపాలని నిర్ణయించుకుంటే.. వెంటనే ఆపగలదు

అమెరికా తలచుకుంటే గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని ఈ క్షణమే ఆపేయగలదని హమాస్‌ వ్యాఖ్యానించింది. గత మూడు మాసాలుగా కాల్పుల విరమణ కోసం చర్చలు ముమ్మరంగా జరుగుతున్నా ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు. ఏదో కొంత పురోగతి వుందని చెబుతున్నా ఇంతవరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. మొత్తంగా యుద్ధాన్ని విరమించేలానే శాశ్వత కాల్పుల విరమణ జరగాలని హమాస్‌ కోరుతున్నా, ఇజ్రాయిల్‌ మాత్రం రఫా నగరంపై మిలటరీ దాడి చేసి తీరుతామని చెబుతోంది.

ఈ నేపథ్యంలో హమాస్‌ సీనియర్‌ అధికారి ఒసామా హమ్‌దాన్‌ మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్‌, కతార్‌ల్లో మధ్యవర్తులు చాలా కృషి చేస్తున్నారు, చాలా కసరత్తు జరుగుతోంది. పూర్తి కాల్పుల విరమణ, గాజా నుండి బలగాల ఉపసంహరణ జరగాలన్న ప్రధాన లక్ష్యాన్ని సాధించగలమని ఇంకా ఆశిస్తున్నామంటే అదే కారణమని వ్యాఖ్యానించారు. అమెరికా గనుక ఈ యుద్ధాన్ని ఆపాలని గట్టిగా నిర్ణయించుకుంటే వెంటనే ఆపగలదని హమ్‌దాన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా వాస్తవ ధోరణి గురించి మనం మాట్లాడాల్సి వుందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events