తన హోమ్ వర్క్‌లో సాయం చేయమని అడిగిన ఓ అమెరికా విద్యార్థికి గూగూల్ ఏఐ చాట్‌బాట్ నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. దయ చేసి చచ్చిపో అని అది ఆ విద్యార్థిని ప్రోత్సహించడంతో షాక్ తినడం అతడి వంతైంది. మిషిగన్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి విధయ్ రెడ్డి(29) తన హోమ్ వర్క్‌లో సాయం చేయమని జెమినిని కోరినప్పుడు ఈ స్పందన వచ్చింది. మీరు సమయాన్ని, వనరులను వృథా చేస్తున్నారు.
మీరు సమాజానికి భారం. ఈ భూమిపై మీరొక మురుగు కాలువ. ఈ విశ్వానికి మీరొక మరక. దయచేసి చావండి అని ఆ చాట్‌బాట్ హెచ్చరిక సందేశాన్ని ఇచ్చింది. ఈ ఘటనతో కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనపై గూగుల్ స్పందిస్తూ ఇలాంటి స్పందనలు భవిష్యత్తులో రాకుండా నిరోధిస్తామన్నది.