Namaste NRI

ఒక‌వేళ  వెన‌క్కి త‌గ్గితే..అత‌న్ని అంతం చేస్తారు: ఎల్ల‌న్ మ‌స్క్‌

టెస్లా కంపెనీ ఓన‌ర్ ఎల్ల‌న్ మ‌స్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెన‌క్కి త‌గ్గితే, అప్పుడు అత‌న్ని హ‌త్య చేసినా ఆశ్చ‌ర్యంలేద‌న్నారు. ఓ ఫోరంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. యుద్ధంతో స‌త‌మ‌తం అవుతున్న ఉక్రెయిన్‌కు మ‌రింత స‌హాయాన్ని అందించాని సేనేట్‌లో బిల్లు పెట్టిన నేప‌థ్యంలో మ‌స్క్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్ వార్‌లో పుతిన్ ఓడిపోర‌న్న అభిప్రాయాల‌ను మ‌స్క్ స‌మ‌ర్తించారు. ఉక్రెయిన్ గెలుస్త‌ద‌ని క‌ల్పిత ప్ర‌పంచంలో ఉండ‌వ‌ద్ద‌న్నారు. బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పొడిగించ‌డ‌మే అవుతుంద‌న్నారు. యుద్ధాన్ని కొన‌సాగించా ల‌న్న వ‌త్తిడి పుతిన్‌పై ఉంద‌ని, ఒక‌వేళ ఆయ‌న వెన‌క్కి త‌గ్గితే, అప్పుడు ఆయ‌న్ను హ‌త‌మారుస్తార‌ని మ‌స్క్ తెలిపారు.

Social Share Spread Message

Latest News