రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న బ్రిక్స్ దేశాల 15వ సదస్సుకు హాజరుకావాల్సి ఉన్న తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు. దాంతో అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా తరఫున బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేసింది. దాంతో పుతిన్ తన దేశం దాటి వస్తే అరెస్టయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
