
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇస్తే దానికి బదులుగా తక్షణం తన అధ్యక్ష పదవిని వదలుకుంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం ప్రకటించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి, నిజంగా నేను పదవి నుంచి దిగాల్సిన అవసరం వస్తే, నేను సిద్ధం. నాటోలో సభ్యత్వానికి బదులుగా నా పదవిని వదులుకుంటా అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అవసరమైతే తక్షణం అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. యూ ఎస్ అధ్యక్షుడు ట్రంప్ తనను అర్థం చేసుకోవాలని, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా కీవ్ తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన గట్టి భద్రతా హామీలను అమలు చేయాలని తాను అమెరికాను కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
