Namaste NRI

ఇండియా వరల్డ్ కప్ కొడితే…నగ్నంగా పరిగెడతా

భారత క్రికెట్‌ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ పోరులో టీమ్‌ఇండియా 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఓవరాల్‌గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత్‌ ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ బిగ్‌ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈ క్ర‌మంలో ఓ టాలీవుడ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇండియా ఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచి వరల్డ్  కప్ కొడితే,  వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్  చేస్తా అని వైజాగ్‌కు చెందిన ప్ర‌ముఖ నటి రేఖా బోజ్ పోస్ట్ పెట్టింది. (స్ట్రీకింగ్ అంటే పబ్లిక్ ప్లేసులో దుస్తులు లేకుండా నగ్నంగా పరిగెత్తడం). దీంతో ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఇది చూసిన నెటిజ‌న్లు ఇదొక పబ్లిసిటీ స్టంట్ కామెంట్స్ చేస్తున్నారు. రేఖా హైప్ కోసం ఇలాంటి బోల్డ్ పోస్ట్ చేసిందని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ‌న్ల కామెంట్స్‌పై రేఖా రిప్లయ్ ఇస్తూ.. క్రికెట్ అంటే ఎమోషన్. కాబట్టి విప్పడంలో తప్పేం లేదు. నేను మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు అని రిప్లే ఇచ్చింది.  2011 వరల్డ్ కప్ టైంలో పూనమ్ పాండే కూడా ఫేమ్ కోసం ఇలానే బోల్డ్ కామెంట్స్ చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events