Namaste NRI

నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న గెలుపు గీత దాటితే

భూపతిరెడ్డి, శ్వేతా నాయర్‌,  మేఘన చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గెలుపు గీత దాటితే.  హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో గెలుపు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. విజయం కోసం కొందరు ఎంచుకున్న సినిమాను తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఇందులో నాలుగు భిన్న షేడ్స్‌తో తన పాత్ర కొత్తగా ఉంటుందని మేఘన చౌదరి చెప్పింది.  కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు హీరో భూపాల్‌ రెడ్డి,  నిర్మాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథతో సినిమా రూపొందించాం. మా ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్‌ రెడ్డి, గడ్డం నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. శివకాళిగోపాల్‌ దర్శకుడు. ఎన్‌.రఘు నిర్మిస్తున్నారు. జనవరి 1న ఈ  చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం : రాజ్‌ కిరణ్‌, చాయాగ్రహణం: లక్కీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events