భారత్తో దౌత్యపరంగా, ఆర్థిక సంబంధాలు కొనసాగించే రోజు వస్తుందని ఆశిస్తున్నానని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం సందర్భంగా దావోస్లో పాత్ఫైండర్ గ్రూప్, మార్టిన్ డౌ గ్రూప్ నిర్వహించిన సెషన్లో ఆయన మాట్లాడారు. భారత్తో సంబంధాలు ఇవాళ కాకపోతే రేపైనా ఆ రోజు రావాల్సిందేనని అన్నారు. నా జీవితంలో ప్రాంతీయ విభేదాలను పరిష్కరించుకోగలిగే రోజు వస్తుందని నేను ఆశిస్తున్నా. పాక్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడదు అని పేర్కొన్నారు.














