Namaste NRI

 మా హీరోయిన్‌ ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్‌ చేస్తాం.. సక్సెస్‌ మీట్‌లో దర్శక, నిర్మాతలు

సమంత టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం యశోద. హరి` హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై  శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను  హైదరాడాద్‌లో  నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద సీక్వెల్స్‌పై స్పష్టత ఇచ్చారు దర్శక నిర్మాతలు. యశోద 2 విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది. అంతేకాదు మూడో భాగానికి ఓ లీడ్‌ ఉంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో చర్చిస్తాం. తను ఒప్పకుంటే వెంటనే సీక్వెల్స్‌ పట్టా లెక్కిస్తాం. మా నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారు. రెండు భాగంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పాత్ర కూడా ఉంటుంది. అలాగే మా చిత్రంలో సూపర్‌ సైంటిస్ట్‌ ఉన్ని ముకుందన్‌ ఉన్నారు. అతను కూడా ఏమైనా చేయగలడు (నవ్వుత) అని చిత్ర దర్శకులు పేర్కొన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ నాయిక ప్రధాన సినిమాలు చేయడం రిస్క్‌ కాదని ఈ సినిమా నిరూపించింది. అభిరుచి గల నిర్మాతలే ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేయగలరు. మంచి సినిమా పట్ల దర్ళకులు హరి, హరీష్‌ సమంతకున్న ఇష్టం వల్లే ఈ విజయం దక్కింది. ఇవాళ సమంత మా కార్యక్రమంలో లేకపోవడం లోటుగా భావిస్తున్నా అని చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events