ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని బైడెన్ పరిపాలన హెచ్చరించడంతో ప్రపంచ చరిత్రలో నిర్ణయాత్మక ఘట్టానికి చేరుకుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మ్యూనిచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో హారిస్ ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి అమెరికా కట్టుబడి ఉందని అన్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తే యునైటెడ్ స్టేట్స్, మా మిత్ర దేశాలు, భాగస్వాములతో కలిసి, గణనీయమైన, అపూర్వమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాం అని అన్నారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా మళ్లీ ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ఆంక్షలతో రష్యాను దెబ్బతీస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
