భయపడితే రైతులకు భయపడతాం తప్ప కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢల్లీిలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రమే ఖర్చు చేస్తున్ననప్పుడు, రైస్ మిల్లర్ల యంత్రాలు మార్చడానికి సమయం ఇచ్చామన్నారు. దేశంలో యాసంగి లక్ష్యాన్ని ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఖరీప్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం అంతకు మించి ఉన్నా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో చేయాల్సిన 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రబీ లక్ష్యానికి సంబంధించి, వచ్చే ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే చెబుతామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ ప్రయోజనాలు ఏమాత్రం అవసరం లేదని, ఆయనకు కుటుంబ ప్రయోజనాలే అవసరమని వివర్శించారు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కేంద్రంపై, ప్రధానిపై పథకం ప్రకారం విష ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు.