ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైనం గనుక పోరాటం ఆపితే చర్యలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాల్ని వదిలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని తెలిపింది. అయితే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమేనంటూ రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ కూడా స్పందించింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే.